హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్ విజిట్ చేస్తే Cookies accept చెయ్యమని అడగడం చూసారా? మీకు ఎప్పుడైనా cookies అంటే ఏంటని సందేహం వచ్చిందా? అయితే ఈరోజు మనం Cookies అంటే ఏంటో తెలుసుకుందాం? ఇంకెందుకు ఆలస్యం.

What are Cookies?

Cookies

మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు వెబ్సైట్కి relatedగా ఉన్న మీ డీటెయిల్స్ ఉదాహరణకు లాగిన్ డీటెయిల్స్,డివైస్ డీటెయిల్స్ మొదలయనివి కోడ్ ఫార్మాట్ లో లోకల్ స్టోరేజ్లో స్టోర్ అవుతాయి.వీటినే cookies అంటారు.

ఇంకా సులభంగా చెప్పాలి అంటే మీ గురించి మరియు మీ కంప్యూటర్ గురించి ఇన్ఫర్మేషన్ ని Cookies అంటారు.

Why website owners display a Cookies Consent Bar?

Cookies Consent Bar

మొదట్లో వెబ్సైట్స్ Cookies Consent Bar డిస్ప్లే చేసేవి కావు.2018 మే 25న General Data Protection Regulation (GDPR)న అమలులోకి వచ్చింది.ఈ చట్టం ప్రకారం consumer డేటా ఏవిధంగా తీసుకుంటున్నారో consumer కి తెలియాలి మరియు consumer పెర్మిషన్ ఇవ్వాలి.

ఈ ఒక్క చట్టంతో చాలా వెబ్సైట్లు Privacy policyని మార్చారు. అప్పటినుంచి వెబ్సైట్లు consumerకి Cookies Consent Bar డిస్ప్లే చేస్తున్నారు.

Types Of Cookies:

1.Session Cookies

Session Cookies

మీరు వెబ్సైట్లో ఉన్నంత వరకు మాత్రమే cookies స్టోర్ అవ్వి వెబ్సైట్ close చేసిన వెంటనే cookies delete అవ్వితే వాటిని Session cookies అని అంటారు.

Session cookies ని In memory cookie,Transient cookie మరియు Non Persistent cookies అని కూడా అంటారు.
మిగతా cookies లాగా particular dateన delete అవ్వాలి అని ఉండదు. 

2.Persistent Cookies

Persistent Cookie

ఒక particular రోజున లేదా particular టైం తరువాత cookies delete అవుతే వాటిని Persistent Cookies అంటారు.ఈ Cookies life span ఎంత ఉండాలి అనేది డెవలపర్ ఇష్టం.

Persistent cookiesని Tracking Cookies అని కూడా అంటారు.వెెబ్సైట్ ఓపెన్ చేసిన ప్రతిసారి information ట్రాన్స్మిట్ అవుతుంది.

3.Secure Cookie

Secure Cookie

Encrypted కనెక్షన్ (HTTPS) ద్వారా మాత్రమే ట్రాన్స్మిట్ అవుతే వాటిని Secure Cookie అంటారు.

Secure cookiesని HTTPS cookie అని కూడా అంటారు.

Pros of Cookies:

Pros of Cookies

Cookies వల్ల వెబ్సైట్ ఓనర్స్ కి ఉపయోగం ఉంటుంది.మీ డేటా ద్వారా వల్ల బిజినెస్ ని develop చేసుకుంటారు.మీరు cookies accept చేస్తే మీకు మంచి సర్వీస్ ఇస్తాము అని వెబ్సైట్స్ చెప్తున్నాయి.

Cons of Cookies:

Cons of Cookies

Cookiesని బట్టే వెబ్సైట్స్ ఆటోమేటిక్ లాగిన్ చేస్తాయి.ఒకవేళ మీ cookies లీక్ అయితే మీ లాగిన్ డీటెయిల్స్ మొదలయినవి లీక్ అయ్యినట్టు.

ఉదాహరణకు మీకు Hotstar సబ్స్క్రిప్షన్ ఉందని అనుకుందాం.మీ ఫ్రెండ్ కి Hotstar  సబ్స్క్రిప్షన్ కావాలి అనుకుందాం. మీకు లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలి అని లేదు.అప్పుడు మీరు వెబ్సైట్ లో Hotstar లోకి లాగిన్ అయ్యి మీ cookiesని export చేసుకోండి.మీ export చేసిన కుకీస్ ని మీ ఫ్రెండ్ని ఇంపోర్ట్ చేసుకోమనండి.ఇప్పుడు తన ఫ్రెండ్ Hotstar లోకి ఆటోమేటిక్ గా లాగిన్ అవుతారు.

ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా అప్డేట్ అయ్యింది.కాబట్టి Cookies ద్వారా ప్రోబ్లేమ్స్ రావు.
ధన్యవాదాలు.