ఈరోజు మనం తెలిగ్రాంలో ఎందుకు Rippers ఎక్కువగా వుంటారు అనేది తెలుసుకుందాం:
1. No need of Identity to Contact other

     Whatsappలో అయితే కచ్చితంగా నెంబర్ ఉంటే గాని కాంటాక్ట్ అవ్వలేము. కానీ, టెలిగ్రామ్ లో Username ఉంటే చాలు కాంటాక్ట్ అవ్వవచ్చు.

     Usernames ఈ విధంగా ఉంటాయి @Username.

     టెలిగ్రామ్ usernames కి లింక్స్ ఉంటాయి. అవి ఇలా ఉంటాయి "t.me/username మరియు telegram.dog/username"
ఈ లింక్స్ ద్వారా ఎవరైనా ఈజీగా ఆ వ్యక్తిని కాంటాక్ట్ అవ్వవచ్చు.

2. Fake Accounts

   WhatsAppలో అయితే Fake Accounts Create చెయ్యడం కష్టం గాని తెలిగ్రాంలో అయితే చాలా ఈజీ. ఇక్కడ ఫేక్ అకౌంట్స్ అంటే వేరే ఐడెంటిటీతో వేరే నెంబర్ తో ఒక అకౌంట్ Create చెయ్యడం. ఇలా create చెయ్యడం చాలా సులభం. ఈ ఫేక్ అకౌంట్స్ యూజ్ చేసి ఫేక్ కస్టమర్ ప్రూఫ్స్ create చెయ్యొచ్చు.

3. Fake Proofs
Paytm Payment Screenshots
Source:Paytm

     తెలిగ్రాంలో rippersలో చాలా మంది Editors వుంటారు. వీళ్ళు కొన్ని ప్రూఫ్స్ Create చేస్తారు. create చేసినా ప్రూఫ్స్ని వాళ్ళ ఛానెల్లో పోస్ట్ చేస్తారు. ఈ ప్రూఫ్స్ ని వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ల ఛానెల్లో పెట్టుకుంటారు.

4. Easy to Rip
Easy to Rip

 నిజానికి టెలిగ్రామ్ లో rippers ఎక్కువమంది ఉండడానికి కారణం సులభంగా మోసం చెయ్యొచ్చు. ప్రూఫ్స్ చూసి మోసపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే వాళ్ల ఆటలు ఇంకా సాగుతున్నాయి. 

ఇలా ఎన్నో కారణాలు ఉన్న ఇవే ముఖ్య కారణాలు. ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండడం మంచిది.
-ధన్యవాదాలు